బీజేపీలోకి నటి.. మమతా టీమ్‌లోకి క్రికెటర్
Cricketer Manoj Tiwary joins TMC. త్వరలో పశ్చిమ బెంగాల్ లో ఎలెక్షన్స్ ఉండడంతో పలువురు ప్రముఖులను ఆకర్షించే పనిలో
By Medi Samrat Published on 25 Feb 2021 4:38 PM ISTటీఎంసీలో కూడా భారీగా చేరికలు జరుగుతున్నాయి. క్రికెటర్ మనోజ్ తివారీ మమతా బెనర్జీ టీమ్ లో చేరబోతున్నట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు క్రికెటర్ మనోజ్ తివారీ ప్రకటించాడు. హుగ్లీలోని చిన్సూరాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించే ర్యాలీలో పార్టీలో చేరుతున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మనోజ్ తివారీ వెల్లడించాడు. టీమిండియా తరపును మనోజ్ తివారీ వన్డేలు, టీ20 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
టీఎంసీకి సంబంధించిన శ్రేణులు మాట్లాడుతూ, లక్ష్మీ రతన్ శుక్లా స్థానాన్ని భర్తీ చేయగల సెలబ్రిటీగా మనోజ్ తివారీని తాము భావించామని చెప్పారు. నాలుగు వారాల క్రితం తివారీని తాము కలిసి, పార్టీలో చేరే అంశంపై చర్చించామని తెలిపారు. లక్ష్మీ రతన్ శుక్లా హౌరా జిల్లా క్రికెట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆయన టీఎంసీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. క్రీడలపై దృష్టి సారించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
A new journey begins from today. Need all your love & support. 😊#DidiShowsTheWay #AssemblyElection #WestBengal #JoyBangla pic.twitter.com/TrrFX67USP
— MANOJ TIWARY (@tiwarymanoj) February 24, 2021