కంగనా రనౌత్ భయంకరమైన రోగి: సీపీఐ నారాయణ
CPI Narayana fire on actor kangana ranaut comments. విలాసవంతమైన బిక్షగత్తె ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు పొందిన కంగనా రనౌత్ అని సీపీఐ నారాయణ అన్నారు
By అంజి Published on 11 Nov 2021 6:48 PM ISTవిలాసవంతమైన బిక్షగత్తె ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు పొందిన కంగనా రనౌత్ అని సీపీఐ నారాయణ అన్నారు. ఆమె ఒక సినీ కళాకారిణి, కళామతల్లికి సేవ చేస్తుంది సంతోషమే. ఆమెకు పద్మశ్రీ అవార్డు ఎందుకిచ్చారో అర్థమైంది కానీ స్వాతంత్ర్య పోరాటం గురించి ఆమెకు తెలీదని బిజెపి, ఆర్ఎస్ఎస్ వాళ్లకు అస్సలు తెలియదని నారాయణ ఆరోపించారు. వాళ్ల చేత పద్మశ్రీ అవార్డు పొందిన కంగనారనౌత్ 1947 లో వచ్చిన స్వాతంత్రం భిక్ష అని అది అసలైన స్వాతంత్య్రం కాదని బిజెపి అధికారంలోకి వచ్చినాక 2014 లో అసలైన స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం బానిసత్వానికి నిదర్శనమని ఇంతకన్న బానిసత్వం ఏముంటుందన్నారు.
యాచకురాలిగా అడుక్కో నీకు బిక్ష ఆర్ఎస్ఎస్ పెడితే అది స్వతంత్ర పోరాటంతో పోలుస్తావా అని ప్రశ్నించారు. స్వాతంత్రం గురించి మాట్లాడే అర్హత నీకే కాదు నీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఆ ప్రభుత్వానికి కూడా లేదని అన్నారు. కంగనారనౌత్ విలాసవంతమైన బిచ్చగత్తె అని.. కుష్టురోగి కంటే భయంకరమైన రోగి ఎవరైనా ఉన్నారంటే అది కంగనారనౌత్ మాత్రమేనని కామెంట్ చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆమె సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆమెకు నిరసన సెగ తగలడం ఖాయమని నారాయణ హెచ్చరించారు.
कभी महात्मा गांधी जी के त्याग और तपस्या का अपमान, कभी उनके हत्यारे का सम्मान, और अब शहीद मंगल पाण्डेय से लेकर रानी लक्ष्मीबाई, भगत सिंह, चंद्रशेखर आज़ाद, नेताजी सुभाष चंद्र बोस और लाखों स्वतंत्रता सेनानियों की कुर्बानियों का तिरस्कार।
— Varun Gandhi (@varungandhi80) November 11, 2021
इस सोच को मैं पागलपन कहूँ या फिर देशद्रोह? pic.twitter.com/Gxb3xXMi2Z