కరోనా బాధితులకు కొత్త ముప్పు.. భయపెడుతున్న గ్యాంగ్రీన్

Covid 19 complications can lead gangrene risk says experts. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న చాలా మందిలో గ్యాంగ్రీన్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని అంటున్నారు డాక్ట‌ర్లు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 May 2021 4:44 AM GMT
gangrene risk

క‌రోనా ఫ‌స్ట్ వేవ్ త‌గ్గింద‌ని అంతా రిలాక్స్ అవుతోన్న స‌మ‌యంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మ‌ధ్య‌లో బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చి చేరింది. దీని విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గానే వైట్ ఫంగ‌స్ వ్యాధి కూడా వ‌చ్చి చేరింది. క‌రోనాతో పాటు ఈ ఫంగ‌స్ వ్యాధుల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. తాజాగా ఇప్పుడు దీనికి గ్యాంగ్రీన్ జ‌త‌క‌లిసింది. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న చాలా మందిలో గ్యాంగ్రీన్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని అంటున్నారు డాక్ట‌ర్లు. పోస్ట్ కొవిడ్ త‌రువాత శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల‌ని లేదంటే.. గ్యాంగ్రీన్‌, గుండెపోటు వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఓ శరీర భాగానికి రక్తం సరఫరా చేసే నాళాలు మూసుకుపోయినప్పుడు, ఆ భాగానికి ప్రాణవాయువు, ఇతర పోషకాలు అందక అక్కడి కణజాలం నశిస్తుంది. ఆ మృత కణజాలం కారణంగా ఆ భాగమంతా నీలం రంగు లేదా నలుపు రంగులోకి మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనేకమంది రోగులు హార్ట్ అటాక్ తో మరణిస్తున్నారు. అందుకు కారణం కరోనా వైరస్ కారణంగా రక్తం గడ్డలు కట్టడమే. ఈ విధంగా రక్తం గడ్డలు కట్టడం వల్ల గ్యాంగ్రీన్ కూడా సంభవిస్తుందని వైద్య‌నిపుణులు అంటున్నారు. రక్త ప్రసరణ నిలిచిపోయి ఆయా భాగాలు కృశించిపోతాయని.. సకాలంలో గుర్తించకపోతే ఈ పరిస్థితి మరణాలకు దారితీస్తుందని వివరించారు.

ఇప్పటికే ఇలాంటి కేసులు గుజరాత్ లో బయటపడ్డట్లు తెలుస్తోంది. క‌రోనాతో పాటు బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ జ‌నాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుండ‌గా.. ఇప్పుడు గ్యాంగ్రీన్ ముప్పు కూడా పొంచి ఉందన్న వార్తల నేప‌థ్యంలో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.




Next Story