ప్రేమించుకొని పారిపోయినందుకు.. వాళ్లకు సహాయం చేసినందుకు శిక్షలు

Couple Thrashed, Paraded With Tyres Around Necks in MP's Dhar. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను దారుణంగా

By M.S.R  Published on  22 Sep 2021 12:30 PM GMT
ప్రేమించుకొని పారిపోయినందుకు.. వాళ్లకు సహాయం చేసినందుకు శిక్షలు

ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను దారుణంగా హింసించారు. స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి డ్యాన్స్‌ చేయించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఆటవిక ఘటన మధ్యప్రదేశ్‌ ధార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ధార్‌ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువతి అదే ఊరికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. పెద్దలు వారిపెళ్లికి అంగీకరించకపోవడంతో ఇటీవలే ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చారు.

వారం రోజుల అనంతరం వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష విధించాలని భావించారు. రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. ఆ జంటను కర్రతో పలు మార్లు కొట్టారు. వారి మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయించారు. ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికకు కూడా శిక్ష విధించారు. గ్రామస్తుల్లో కొందరు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వీడియో పోలీసుల దాకా వెళ్లడంతో కేసు నమోదు చేసి ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.


Next Story