పెళ్లి జీవితంలో జరిగే గొప్ప వేడుక. ఈ వేడుకను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటారు చాలా మంది. ప్రత్యేకంగా వధూ వరులు పెళ్లి వేదికపైకి వచ్చేందుకు వివిధ ఆలోచనలతో ఏన్నో ఏర్పాట్లు చేస్తుంటారు ఈవెంట్ మేనేజర్లు. ఎంతో ఆడంబరంగా పెళ్లి వేడుకను నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. స్టేజి పైన ఓ వైపు డ్యాన్సులతో మరో వైపు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. అదే సమయంలో ఒక వలయాకారం ఊయలపైకి వధూవరులు ఎక్కారు.
ఆ తర్వాత అది మెల్లగా పైకి లేచింది. అయితే కొద్ది క్షణాల్లోనే ఉన్నట్టుండి తాడు తెగిపోయింది. దీంతో వధూవరులు కిందపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దంపతులు 12 అడుగుల ఎత్తు నుంచి కిందపడి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆ దుర్ఘటనను పక్కన పెడితే, 30 నిమిషాల తర్వాత వివాహ వేడుకలు కొనసాగాయి. ఈ ప్రమాదానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ పూర్తి బాధ్యత వహించింది. వధూవరులకు తమ పొరపాటు వల్ల జరిగిన నష్టానికి క్షమాపణ చెప్పారు.