ఆ వయస్సు పిల్లల కోసం.. అందుబాటులోకి మరో వ్యాక్సిన్
Corbevax gets emergency approval for 12-18 age group. హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోలాజికల్ ఇ లిమిటెడ్ సోమవారం తన కరోనావైరస్ వ్యాక్సిన్ కార్బెవాక్స్
By అంజి Published on 22 Feb 2022 11:42 AM ISTహైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోలాజికల్ ఇ లిమిటెడ్ సోమవారం తన కరోనావైరస్ వ్యాక్సిన్ కార్బెవాక్స్... 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో ఉపయోగించడానికి భారతదేశంలో అత్యవసర వినియోగ అనుమతిని పొందిందని సోమవారం తెలిపింది. ఇది భారతదేశంలోని మూడవ స్వదేశీ వ్యాక్సిన్. భారత్‌లో ఇప్పటివరకు 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే టీకాలు వేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 15 నుండి 17 సంవత్సరాల మధ్య 76 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలకు ప్రధానంగా కోవాక్సిన్‌తో టీకాలు వేయబడ్డాయి.
ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ యొక్క భారతదేశ కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా.. ఇంతకుముందు కార్బెవాక్స్ వ్యాక్సిన్ సురక్షితమైనదని, కొన్ని ఇతర వెక్టర్ వ్యాక్సిన్‌ల కంటే మంచి ఇమ్యునోజెనిసిటీ, అధిక యాంటీబాడీ స్థాయిలను అందిస్తుందని చెప్పారు. "ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్‌లు సురక్షితమైన వ్యాక్సిన్‌లు, ఇమ్యునోజెనిసిటీ చాలా మంచిది. వెక్టర్ వ్యాక్సిన్ లేదా ఎమ్ ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ వంటి కొన్ని ఇతర వ్యాక్సిన్‌లతో పోలిస్తే స్థానిక ప్రతిచర్యలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ టీకా గురించి మరొక ముఖ్యమైన కోణం కొన్ని వెక్టర్ వ్యాక్సిన్‌లతో పోలిస్తే, యాంటీబాడీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి." అని డాక్టర్ అరోరా ఒక ఇంటర్య్వూలో చెప్పారు.
కార్బెవాక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో భిన్నమైన సమూహాలపై కూడా బాగా పనిచేస్తుందని డాక్టర్ అరోరా తెలిపారు. ఓమిక్రాన్‌తో పోల్చితే డెల్టాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ "ఎక్కువ కార్యాచరణ" చూపిందని ఎన్‌టీఏజీఐ చీఫ్ చెప్పారు. నివేదికల ప్రకారం.. ప్రభుత్వం బయోలాజికల్ ఇ ఫార్మా సంస్థతో ఐదు కోట్ల డోస్‌ల 'కార్బెవాక్స్' కోవిడ్-19 వ్యాక్సిన్‌కు ఆర్డర్ చేసింది. ఒక్కో డోస్ ధర రూ. 145. గతేడాది ఆగస్టు 21న కేంద్రం 30 కోట్ల కార్బెవాక్స్ డోస్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది.