Video: పోలీస్ స్టేషన్‌లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి
By - Knakam Karthik |
Video: పోలీస్ స్టేషన్‌లో గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన పోలీస్
కేరళలోని ఒక పోలీస్ స్టేషన్ లోపల స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) గర్భిణీ స్త్రీని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రతాప చంద్రన్, స్టేషన్‌లో జరిగిన వాదనలో కొచ్చికి చెందిన షైమోల్‌ను చెంపదెబ్బ కొట్టడాన్ని వీడియోలో కనిపిస్తుంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నాటి ఈ ఫుటేజ్, షైమోల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను చూపించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత వెలుగులోకి వచ్చింది. న్యాయ పోరాటం తర్వాత, కోర్టు ఆ ఫుటేజీని ఆమెకు అప్పగించాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన సంఘటన గత ఏడాది జూన్‌లో జరిగింది. వివరాల ప్రకారం, రైల్వే స్టేషన్ సమీపంలో దంపతులు నిర్వహిస్తున్న టూరిస్ట్ హోమ్ ముందు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులను బలవంతంగా నిర్బంధించడాన్ని వీడియో తీసినందుకు షైమోల్ భర్త బెన్ జోను అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తరువాత పోలీసు సిబ్బంది తమ విధిని నిర్వర్తించకుండా ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై అతన్ని కేసులో మూడవ నిందితుడిగా చేర్చారు.
ఈ సంఘటన జరిగినప్పుడు షైమోల్ తన భర్త గురించి విచారించడానికి ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. సంభాషణ సమయంలో, SHO ఆమెతో మాటలతో వాగ్వాదానికి దిగి, ఆమెను నెట్టివేసి, తరువాత స్టేషన్ లోపల ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ పోలీసుల చర్యను విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత గురించి గొప్పగా చెప్పుకునే వాగ్దానాన్ని ఇటువంటి సంఘటనలు ప్రతిబింబిస్తాయా అని ప్రశ్నించారు.
CCTV footage has surfaced showing a #Police officer pushing and slapping a woman inside the Town North police station, EKM. The woman was reportedly 3 months pregnant at the time of the incident, which occurred in June 2024, more than a year ago. @NewIndianXpress @xpresskerala pic.twitter.com/nCmPV1DlK0
— Raam Das (@P__RamDas) December 19, 2025