మీడియా ముందు ఏడ్చేసిన డీకే శివ కుమార్

Congress's DK Shivakumar gets emotional after results. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుని వెళుతోంది.

By Medi Samrat
Published on : 13 May 2023 1:10 PM IST

మీడియా ముందు ఏడ్చేసిన డీకే శివ కుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుని వెళుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యకర్తలే తమ విజయానికి కారణమని శివకుమార్ చెప్పుకొచ్చారు. తనను నమ్మిన సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని శివకుమార్ చెప్పుకొచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు సిద్దరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారాయన.

కర్ణాటక కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ విజయం సాధించారు. ఆయన కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి ఆయన వరసగా నాలుగోసారి గెలిచారు. కాంగ్రెస్​ విజయానికి అడుగుదూరంలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్​ జోష్​లో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే విషయమై ప్రస్తుతం కర్ణాటకలో సస్పెన్స్ నడుస్తోంది.


Next Story