మహిళపై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ కార్యకర్త.. బీజేపీ ఘాటు విమర్శలు

Congress worker showering money on dancer goes viral. డ్యాన్స్ చేస్తున్న మహిళపై డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది

By M.S.R  Published on  8 March 2023 4:35 PM IST
మహిళపై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ కార్యకర్త.. బీజేపీ ఘాటు విమర్శలు

Congress worker showering money on dancer


కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్త వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై డబ్బుల వర్షం కురిపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. డబ్బులు విసిరేసే సంస్కృతిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని బీజేపీ విమర్శలు గుప్పించింది. వైరల్ అవుతున్న వీడియోలో హుబ్లీకి చెందిన శివశంకర్ హంపన్న అనే కాంగ్రెస్ కార్యకర్త.. మహిళ పక్కన డ్యాన్స్ చేస్తూ ఆమెపై డబ్బు విసిరేశాడు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ వీడియోపై కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేశ్ టెంగింకై స్పందిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్త చేసిన పని సిగ్గుచేటని అన్నారు. తాను టీవీలో వీడియో చూశానని.. ఈ వ్యక్తులకు డబ్బు విలువ తెలియదు, ఇటువంటి ఉదంతాలు కాంగ్రెస్ సంస్కృతి ఏమిటో తెలియజేస్తాయని విమర్శలు గుప్పించారు. భాజపా అధికార ప్రతినిధి రవినాయక్‌ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అమ్మాయిలకు ఈ విధంగా గౌరవం ఇస్తున్నారని అన్నారు. ఇది కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్న సంస్కృతి అని దుయ్యబట్టారు.


Next Story