21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
డిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు
By Medi Samrat Published on 17 Dec 2023 3:20 PM ISTడిసెంబర్ 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు.. అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు తమ ఎన్నికల ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ ఈ సమావేశానికి పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశానికి పిలిచినట్లు సమాచారం.
మూలాల ప్రకారం.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశం.. ఇండియా కూటమి భేటీ ముగిసిన రెండు రోజుల తర్వాత జరుగనుంది. డిసెంబరు 19న ఇండియా కూటమి సమావేశం జరగనుంది.
వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన అంశంగా రాహుల్ గాంధీ చేపట్టనున్న యాత్రపై కూడా వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పాదయాత్ర చేయాలా.. లేక వేరే పద్ధతిలో నిర్వహించాలా అనే అంశాన్ని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాలినడకతో సహా హైబ్రిడ్ మోడ్‌లో ఈ యాత్ర నిర్వహించాలని పార్టీ పరిశీలిస్తోంది. త్వరలో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో విశ్లేషించనున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలలో ఓటమిపై చర్చించనున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించిన మార్గాలపై కూడా చర్చించనున్నారు.