కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. జ్వరం, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున్ ఖర్గే జ్వరం, కాళ్లనొప్పితో బాధపడుతుండటంతో మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పార్టీ నేత తెలిపారు.