మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి అనే విష‌యం గుర్తు పెట్టుకోవాలి.. బండి సంజ‌య్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంట‌ర్‌

పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్‌లో లెవనెత్తుతాన‌ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on  29 Jan 2025 4:21 PM IST
మీరు కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి అనే విష‌యం గుర్తు పెట్టుకోవాలి.. బండి సంజ‌య్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంట‌ర్‌

పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్‌లో లెవనెత్తుతాన‌ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు.. కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. హరీష్ రావు ముందు కేసీఆర్‌ను ప్రజలకు దర్శనం ఇవ్వమ‌ని చెప్పాల‌న్నారు. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదన్నారు. బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు.

ఈ సారి అయినా లోకసభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలన్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి పోయాడో కేటీఆర్‌ను అడిగితే వ్యంగ్యంగా స‌మాధాన‌మిస్తార‌ని అన్నారు. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి మోదీని రాష్ట్రానికి పెద్దన్న లాగా ఉండమన్నారని.. కానీ ప‌రిస్థితి అలా లేద‌న్నారు. కాంగ్రెస్‌లో 8 మంది ఎంపీలు ఉన్నారు.. తెలంగాణ ప్రజలు 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు.. మిమ్మల్ని ప్ర‌జ‌లు గెలిపించింది ఎందుకు అని ప్ర‌శ్నించారు. లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఉండి ఆర్ఆర్ఆర్‌పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడంపై వాళ్ల వైఖరి అర్థం చెసుకోవచ్చన్నారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్‌ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.. ఆర్ఆర్ఆర్‌ హైదరాబాద్ లైఫ్ లైన్.. దానికి 45వేల కోట్లు అవసరం.. ఆర్ఆర్ఆర్‌, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు.

పద్మ అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యత రహిత్యంగా మాట్లాడార‌ని విమ‌ర్శించారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలను నెగెటివ్ ప్రచారం చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదన్నారు. మూసీ కోసం పార్లమెంట్‌లో ఎంపీలందరం కొట్లాడాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పే చేస్తుందన్నారు. పది ఏండ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు.

Next Story