ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ 'కులం' వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 31 July 2024 4:58 PM ISTపార్లమెంట్‌లో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ 'కులం' వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు చేసిన ఫిర్యాదులో, లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని చన్నీ అన్నారు. కొన్ని వ్యాఖ్యలను సభాకార్యక్రమాల సమయంలో సభాపతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ జగదాంబికా పాల్ రికార్డుల నుంచి తొలగించారు.
కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి ప్రధాని మోదీ మద్దతిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను కాంగ్రెస్ తీసుకువచ్చింది. మంగళవారం లోక్‌సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులంపై వ్యాఖ్యలు చేశారు. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ప్రధాని మోదీ పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలను తీవ్రంగా ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో మోదీకి వ్యతిరేకంగా ప్రత్యేక అధికార తీర్మానాన్ని తీసుకొచ్చింది. పంజాబ్ మాజీ సీఎం, జలంధర్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఈ మేరకు ప్రధాని మోదీపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. అనురాగ్ ఠాకూర్ ప్రసంగం.. అత్యంత దారుణమని.. రాజ్యాంగ విరుద్ధం అని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. మంగళవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా, రాహుల్ గాంధీ కులాన్ని అనురాగ్ ఠాకూర్ స్పష్టంగా ప్రస్తావించడంతో విపక్షాలు నిరసనలకు దిగాయి.