టీమిండియాకు ప్రియాంక గాంధీ విషెస్‌

Congress leader Priyanka wishes Team India ahead of match. ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్‌, పాకిస్థాన్‌తో

By Medi Samrat  Published on  28 Aug 2022 5:02 PM IST
టీమిండియాకు ప్రియాంక గాంధీ విషెస్‌

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్‌, పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ముందు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. గ‌తంలో కరాచీలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించిన జ్ఞాపకాన్ని పంచుకుంటూ.. ప్రియాంక గాంధీ ఒక వీడియో సందేశంలో టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. "మొత్తం దేశం నుండి, నా కుటుంబం మరియు నా నుండి శుభాకాంక్షలు, వెళ్ళండి, ఆడండి, గెలవండి" అని గాంధీ అన్నారు.

చాలా ఏళ్ల క్రితం భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు కరాచీలో పర్యటించడం నాకు ప్రత్యేక జ్ఞాపకం. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిచిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో అక్కడే ఉన్న నేతలంతా స్టేడియంలో టీమిండియా విజయంతో సంబరాలు చేసుకున్నారని ఆమె త‌న సందేశంలో పేర్కొంది. ఆగస్టు 28న భారత్ పాకిస్థాన్‌తో తలపడుతుంది. దేశం మొత్తం నుండి జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు అని త‌న వీడియో సందేశంలో పేర్కొన్నారు.


Next Story