నిన్న సోనియా.. నేడు ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్‌

Congress Leader Priyanka Gandhi Tests Positive for COVID-19.కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి గురువారం క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 11:10 AM IST
నిన్న సోనియా.. నేడు ప్రియాంక గాంధీకి క‌రోనా పాజిటివ్‌

కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి గురువారం క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ కాగా.. ఆమె కుమారై ప్రియాంక గాంధీకి నేడు(శుక్ర‌వారం) కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.' నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. స్వ‌ల్ప ల‌క్షణాలు ఉన్నాయి. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. న‌న్ను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాలి' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

అంత‌క‌ముందు ప్రియాంక గాంధీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ల‌క్నోకు వెళ్లారు. అయితే.. నిన్న అర్థాంత‌రంగా టూర్‌ను ర‌ద్దు చేసుకుని ఢిల్లీకి వ‌చ్చారు. అయితే.. తన షెడ్యూల్ ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి ఆమె వెనక్కి వచ్చేశారు. ఇంతలోనే ఆమెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

Next Story