అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్ పార్టీ. రోజురోజుకు పలుచబడిపోతున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అసలు పత్తా లేకుండాపోయింది. ఉన్న పంజాబ్ కూడా చేతినుంచి జారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ పార్టి మారి కొత్త పార్టి పెట్టినా పోటీలో వెనుకబడిపోయారు. ఇక ఇప్పుటి తాజా సీఎం చన్నీ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఇక ఇతర మంత్రివర్గం కూడా అదే బాటలో పయనిస్తోంది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ అందని ద్రాక్షగా మారింది. డబుల్ డిజిట్ కూడా చేరుకోలేదు సరికదా నాలుగోస్థానానికే పరిమితమయింది. గాంధీలకు పట్టున్న నియోజకవర్గాలు అమేథి, రాయ్ బరేలిలో కూడా కాంగ్రెస్ సీట్లను గెలవలేకపోయింది.
రాహుల్ గాంధీతో పాటుగా, ప్రియాంక కూడా కంగ్రెస్ కు అదృష్టాన్ని అందివ్వలేకపోయారు. ఇక ఇప్పటికే నాయకత్వ లోపం స్పష్టంగ ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు సరికొత్తగా జవజీవాలు తీసుకొచ్చే బాధ్యతలు ఎవరివనే ప్రశ్న కూడా మొదలయింది. 125 ఏళ్ల పార్టీకి ఇన్ని కష్టాలు గతంలో రాలేదు. ఇక దక్షిణాదిలోనూ అష్టకష్టాలు పడ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఒక్క కర్నాటక తప్ప ఎక్కడా పాఋటి జాడ కనిపించట్లేదు. మరి తెలంగాణాలో మ్యాజిక్ ఏమన్న జరిగే చాన్సుందా? పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానితోపాటుగా పార్టికి ఎలా బూస్ట్ అందివ్వాలనే దానిపై ఇప్పుడు ఫోకస్ పెట్టాలంటున్నారు సీనియర్లు.