'భారత్ జోడో' యాత్ర టైటిల్ సాంగ్ విడుదల
Congress Bharat Jodo Yatra title song release. కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర ప్రచారానికి సంబంధించిన
By అంజి Published on 5 Sept 2022 1:18 PM ISTకాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర ప్రచారానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే ఈ పాదయాత్ర.. ఆయా రాష్ట్రాలకు చేరుకున్నప్పుడు.. ఆయా భాషల్లో ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర ప్రచారాన్ని bharatjodoyatra.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. మంగళవారం తమిళంలో, సెప్టెంబర్ 11న మలయాళంలో, సెప్టెంబర్ 30న కన్నడలో టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులతో సమావేశమైన తర్వాత కన్యాకుమారిలోని వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల నుంచి సెప్టెంబర్ 8న ఉదయం ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. భారత్ జోడో అంటే 'మన్ కీ బాత్' కాదని, ప్రజల ఆందోళనలు, డిమాండ్లను కేంద్రానికి తీసుకెళ్లే కార్యక్రమం అని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రతిరోజూ 22-23 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని జైరాం రమేష్ పేర్కొన్నారు.
ప్రతి రోజు రెండు పూటలూ పాదయాత్ర ఉంటుంది. ఉదయం 7 నుండి 10:30 వరకు, మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:30 వరకు పాదయాత్ర సాగుతుంది. భారత్ జోడో యాత్ర అన్ని రాష్ట్రాలను తాకుతూ వెళుతుందని, సంబంధిత రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని జైరాం రమేష్ తెలిపారు.
Ek Tera Kadam
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2022
Ek Mera Kadam
Mil Jaaye
Jud Jaaye
Apna Vatan
एक तेरा कदम
एक मेरा कदम
मिल जाए
जुड़ जाए
अपना वतन
The @bharatjodo anthem in Hindi encapsulating the philosophy of the Yatra has been launched today!#MileKadamJudeVatan pic.twitter.com/3T40mDZueS