మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రిలో చేరారు. మెడనొప్పి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. గత రెండేళ్లుగా కోవిడ్ 19పై విశ్రాంతి లేకుండా పోరాడుతూ మెడ నొప్పిని పట్టించుకోలేదని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. సరైన చికిత్స కోసం, వైద్యులు రెండు మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించడంతో ఆస్పత్రిలో చేరుతున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఏ ఆస్పత్రిలో చేరుతున్నారనే విషయాన్ని ప్రకటనలో సీఎం వెల్లడించలేదు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే మెడనొప్పితో బుధవారం సాయంత్రం సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు. ఆన్‌లైన్‌లో క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత ఠాక్రే ఆసుపత్రికి చేరుకున్నారు. మెడనొప్పి సమస్య మరింత తీవ్రమయ్యేలోపు దానిని తప్పనిసరిగా పరిష్కరించాలని వైద్యులు సూచించారు.