హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం

హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

By Medi Samrat  Published on  17 Oct 2024 8:55 AM GMT
హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం

హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాయబ్ సైనీతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి నగరమంతటా స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. నాయబ్ సైనీ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్ర‌మాణం చేసిన‌ ఎమ్మెల్యేలు వీరే..

1. బర్వాలా ఎమ్మెల్యే రణబీర్ గాంగ్వా

2. నర్వానా ఎమ్మెల్యే కృష్ణ బేడీ

3. ఇస్రానా ఎమ్మెల్యే కృష్ణలాల్ పన్వార్

4. రాదౌర్ ఎమ్మెల్యే శ్యామ్ సింగ్ రాణా

5. అటెలి ఎమ్మెల్యే ఆర్తీరావు

6. తోషం ఎమ్మెల్యే శృతి చౌదరి

7. గోహనా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ శర్మ

8. అంబాలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనిల్ విజ్

9. పానిపట్ రూరల్ ఎమ్మెల్యే మహిపాల్ దండా

10. ఫరీదాబాద్ ఎమ్మెల్యే విపుల్ గోయల్

11. తిగావ్ ఎమ్మెల్యే రాజేష్ నగర్

12. పల్వాల్ ఎమ్మెల్యే గౌరవ్ గౌతమ్

13. బాద్షాపూర్ ఎమ్మెల్యే రావు నర్బీర్

Next Story