నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆయన జయంతి జనవరి 23ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ''నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మేము మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, జాతీయ నాయకుడికి నివాళులు అర్పించేందుకు.. దేశ్ నాయక్ దిబాస్‌ని అత్యంత సముచితంగా జరుపుకోవడానికి దేశం మొత్తం అనుమతించాలని" కోరుతూ ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనేకసార్లు ఇదే విషయాన్ని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కూడా జాతీయ నాయకుడికి నివాళులు అర్పించేందుకు, దేశ్‌నాయక్‌దిబాస్ అత్యంత సముచితమైన రీతిలో జరుపుకోవడానికి యావత్ జాతిని అనుమతించాలని ఆమె అభ్యర్థించారు.
"నేతాజీ 125వ జన్మదినోత్సవాన్ని, దేశ్‌నాయక్‌దిబాస్‌గా రాష్ట్రమంతటా ప్రోటోకాల్‌లను అనుసరించి తగిన రీతిలో జరుపుకుంటోంది" అని ముఖ్యమంత్రి మమతా రాశారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, నాయకత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని, నేతాజీ తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఆమె అన్నారు. ఈ జాతీయ నాయకుడికి నివాళులు అర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల శ్రేణిని వివరిస్తూ.. "100 శాతం రాష్ట్ర నిధులతో.. నేతాజీ జ్ఞాపకార్థం కొన్ని దీర్ఘకాలిక కార్యక్రమాలలో, అంతర్జాతీయ సహకారంతో జాతీయ విశ్వవిద్యాలయం, జై హింద్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతోంది. అన్నారు. జాతీయ ప్రణాళికా సంఘంపై నేతాజీ ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది, రాష్ట్ర ప్రణాళికా కార్యక్రమాల్లో సహాయపడేందుకు బెంగాల్ ప్లానింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.