సీఎం ప్రెస్‌మీట్‌లో పాము క‌ల‌క‌లం

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రెస్‌మీట్‌లో పాము క‌ల‌క‌లం రేపింది.

By Medi Samrat  Published on  21 Aug 2023 4:11 PM IST
సీఎం ప్రెస్‌మీట్‌లో పాము క‌ల‌క‌లం

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రెస్‌మీట్‌లో పాము క‌ల‌క‌లం రేపింది. బిలాస్‌పూర్‌లో మీడియా ప్రతినిధులతో సీఎం మాట్లాడుతుండగా.. ఆయన కాళ్ల కిందకు పాము వచ్చింది. పాము రావడంతో జనంలో కలకలం రేగింది. సీఎం భూపేష్ బఘేల్.. పామును చంపవద్దని ప్రజలకు సూచించారు. చిన్నతనంలో పామును జేబులో పెట్టుకుని వెళ్లేవాళ్లమ‌న్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో మాజీ, దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ పేరిట అనేక పథకాలు అమలవుతున్నాయని.. ఈ పథకాలతో కలిపి రూ. 2055 కోట్లకు పైగా నిధులు అందజేశామని అన్నారు. ఇందులో మధ్యవర్తి ఎవరూ లేరని సీఎం బఘేల్ అన్నారు. మధ్యలో మనిషి లేడు. కమీషన్ లేదు. ఇప్పటి వరకు దాదాపు లక్షా 60 వేల కోట్ల ల‌బ్ది జ‌రిగింద‌ని అన్నారు. ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రభుత్వం.. కార్మికులు, రైతులు, యువత అందరి ప‌క్షాన‌ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

Next Story