ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. బదాసు నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ జిల్లాలోని గుప్త్కాషిలో అత్యవసరంగా ల్యాండ్చేశారు. దీంతో హెలికాప్టర్‌లో ఉన్న వారందరూ సురక్షితంగా భయట పడినట్లు ఉత్తరాఖండ్ ఏడిజి లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ తెలిపారు.
కాగా ఆ హెలికాప్టర్ క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. రహదారిపై పార్క్ చేసి ఉన్న కారు కూడా ధ్వంసం అయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.