టెన్షన్ మొదలైంది.. చైనా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా

China-returnee tests positive for Covid in Agra. చైనా నుండి తిరిగి వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

By M.S.R  Published on  25 Dec 2022 7:15 PM IST
టెన్షన్ మొదలైంది.. చైనా నుండి వచ్చిన వ్యక్తికి కరోనా

చైనా నుండి తిరిగి వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం నాడు అతడికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) డాక్టర్ ఎకె శ్రీవాస్తవ ధృవీకరించారు. అతని నమూనా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని.. ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఆగ్రాలోని నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శాఖ అధికారులు రోగితో పరిచయం ఉన్న ఇతర వ్యక్తులను కనుగొని జాబితాను సిద్ధం చేస్తున్నారు. రోగితో పరిచయం ఉన్న వ్యక్తులను కూడా విచారించనున్నట్లు అధికారి తెలిపారు. రోగి డిసెంబర్ 23న చైనా నుంచి తిరిగి వచ్చినట్లు సమాచారం.

చైనాలో పని చేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలైతే కనిపించలేదని.. ప్రస్తుతం అతడిని షాగంజ్‌లోని అతడి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. చైనా నుంచి వచ్చిన ఆ వ్యక్తిని కలిసినవారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత ఆగ్రా రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, విమానాశ్రయంలో టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


Next Story