ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు నాయకత్వం వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ (86) శనివారం ఉదయం కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 22 Jun 2024 6:33 PM IST

ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ కన్నుమూత

అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపనకు నాయకత్వం వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ (86) శనివారం ఉదయం కన్నుమూశారు. దీక్షిత్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మణికర్ణిక ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో దీక్షిత్ ముఖ్యమైన పాత్ర పోషించారు. వారణాసి సీనియర్ పండితులలో ఒకరిగా గుర్తింపు పొందిన దీక్షిత్ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవారు.

86 ఏళ్ల వయసున్న ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులు కొన్ని తరాలుగా వారణాసిలో నివసిస్తున్నారు. దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. కాశీ మహా పండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించిన ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని తెలిపారు.

Next Story