ఇంత యంగ్ గా ఉన్నారేంటి సార్.. సీఎం కు లేడీస్ నుండి ఎదురైన ప్రశ్న

Chief Minister MK Stalin Blushes At Question On Morning Walk. మనం ఎంత వయసులో ఉన్నా కూడా.. ఉన్న వయసు కంటే యంగ్ గా కనిపించాలని ప్రయత్నిస్తూ

By M.S.R  Published on  21 Sept 2021 5:57 PM IST
ఇంత యంగ్ గా ఉన్నారేంటి సార్.. సీఎం కు లేడీస్ నుండి ఎదురైన ప్రశ్న

మనం ఎంత వయసులో ఉన్నా కూడా.. ఉన్న వయసు కంటే యంగ్ గా కనిపించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అలాంటి కాంప్లిమెంట్లు వస్తే ఎలాంటి వారైనా మురిసిపోతూ ఉంటారు. తాజాగా ముఖ్యమంత్రి గారికి అలాంటి ప్రశ్నే ఎదురైంది. ఇంతకూ ఎవరా ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారా..? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. స్టాలిన్ వ‌య‌సు 68 ఏళ్లు అయినప్పటికీ చాలా యంగ్‌గా క‌నిపిస్తుంటారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న్ను ఓ మ‌హిళ ఇదే ప్ర‌శ్న వేసింది. మీరింత యంగ్‌గా ఎలా క‌నిపిస్తున్నార‌ని ఆమె న‌వ్వుతూ ప్ర‌శ్నించింది.

దానికి స్టాలిన్ కూడా కాస్త సిగ్గుప‌డుతూనే.. డ‌యిట్ కంట్రోల్ అంటూ స‌మాధానం ఇచ్చారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను డీఎంకే పార్టీ ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది. డీఎంకే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీ త‌మ నేత స్టాలిన్‌కు సంబంధించిన ఫిట్‌నెస్ వీడియోల‌ను త‌రుచూ పోస్టు చేస్తూనే ఉన్న‌ది. గ‌త నెల‌లో స్టాలిన్ వ‌ర్కౌట్ చేస్తున్న వీడియోను ఒక‌టి షేర్ చేశారు. జిమ్‌లో రొటీన్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తున్న 37 సెక‌న్ల ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. ఆయ‌న సైకిలింగ్ కూడా చేస్తూ చాలా సార్లు కనిపించారు.


Next Story