కరోనా మహ్మమారి విజృంభణ కొనసాగుతోంది. ధనిక-పేద అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ వైరస్ భారిన పడి కోలుకున్నారు. తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కరోనా సోకింది.
స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో సంగ్మా కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని సంగ్మా స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. తేలికపాటి కరోనా వైరస్ లక్షణాలున్నాయని, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు మేఘాలయలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,586కు చేరగా ఇప్పటి వరకు వైరస్ బారినపడి 123 మంది మరణించారు.