ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ.. మద్యం షాపుల్లో..

Chhattisgarh Govt takes major decision in view of rising corona cases. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ.. మద్యం షాపుల్లో..

By అంజి  Published on  8 Jan 2022 8:59 AM GMT
ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ.. మద్యం షాపుల్లో..

ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య మద్యం ఆన్‌లైన్‌లో డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు తమ జిల్లాల్లో ఆన్‌లైన్‌లో మద్యం విక్రయించాలని నిర్ణయించారు. అయితే ఆఫ్‌లైన్‌లో మద్యం విక్రయాలు కూడా కొనసాగుతాయి. కరోనా వైరస్ కట్టడికి మద్యం షాపుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అంతేకాకుండా, అన్ని రకాల మద్యం దుకాణాలలో శానిటైజేషన్, బారికేడింగ్, సామాజిక దూరం ఉండేలా చూడాలని ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా ఆదేశించారు. csmcl ఆన్‌లైన్ యాప్ లేదా https://csmcl.in పోర్టల్ నుండి కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్ చేయవచ్చని అధికారులు తెలిపారు. దీని కోసం, ప్రజలు తమ మొబైల్ నంబర్, ఆధార్ కార్డు వివరాలతో పాటు పూర్తి చిరునామాను ఇవ్వాలి. ఆ తర్వాత వినియోగదారుల ఇంటికి మద్యం సరఫరా చేస్తారు. అయితే, వినియోగదారులు డెలివరీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు, భారతదేశంలో ఇప్పుడు కరోనా నియంత్రణ లేకుండా పోతోంది. ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆంక్షలు కూడా ప్రారంభమయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో కొత్త కరోనా రోగుల సంఖ్య 1 మిలియన్‌కు చేరుకోవచ్చని, ఫిబ్రవరి మొదటి వారంలో మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భయపడుతున్నారు. మరోసారి లాక్ డౌన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ విధించగా, అనేక ఆంక్షల నేపథ్యంలో ఈరోజు నుండి ఢిల్లీలో కూడా వారానికోసారి కర్ఫ్యూ విధించారు.

Next Story