104 గంటల తర్వాత బయటపడ్డ రాహుల్
Chhattisgarh Boy Who Fell Into Borewell Rescued After 104 Hours.ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోరుబావిలో
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2022 8:40 AM GMTఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాలో బోరుబావిలో పడిపోయిన రాహుల్ సాహు అనే 11 ఏళ్ల బాలుడిని మంగళవారం రాత్రి బయటకు తీశారు. 104 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత రక్షించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), సైన్యం, స్థానిక పోలీసులు, పరిపాలనా యంత్రాంగం సహా 500 మందికి పైగా సిబ్బంది శుక్రవారం సాయంత్రం మొదలైన ఈ భారీ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
రాహుల్ సాహు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ మల్ఖరోడా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని పిహ్రిద్ గ్రామంలో 80 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. అతను దాదాపు 60 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఎంతో కష్టపడి రాహుల్ ను బయటకు తీశారు. బాలుడిని స్ట్రెచర్‌లో తీసుకెళ్లినట్లు టెలివిజన్ విజువల్స్ చూపించాయి. "అతని పరిస్థితి నిలకడగా ఉంది. అతను త్వరలో కోలుకుంటాడు. స్పెషలిస్ట్ డాక్టర్ల పరిశీలనలో అంబులెన్స్‌లో అతన్ని బిలాస్‌పూర్ జిల్లాలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. 100 కి.మీల గ్రీన్ కారిడార్ సృష్టించబడింది," అని బిలాస్‌పూర్ కలెక్టర్ జితేంద్ర శుక్లా తెలిపారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ట్వీట్ చేస్తూ, "అందరి ప్రార్థనలు రెస్క్యూ టీమ్, అవిశ్రాంతంగా.. అంకితభావంతో పని చేయడంతో రాహుల్ సాహు సురక్షితంగా బయటపడ్డారు. అతను వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అని చెప్పుకొచ్చారు.
मुख्यमंत्री श्री @bhupeshbaghel की सतत मॉनिटरिंग में @NDRFHQ, #एसडीआरएफ, @CG_Police, भारतीय सेना और @JanjgirDist ने संयुक्त रूप से कर्तव्यनिष्ठा का पालन करते हुए राहुल को बोरवेल से निकालने का दुष्कर कार्य कर दिखाया। यह ऑपरेशन पूरे देश के लिए मिसाल है। छत्तीसगढ़ ने इतिहास रचा है। pic.twitter.com/l5mOuXrL9b
— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) June 14, 2022