బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు పని చేయవు
Cheques, passbook of 8 banks to become invalid from April 1. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు జారీ చేసిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు కావు.
By Medi Samrat Published on 16 March 2021 5:29 AM GMTఅయితే కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్ప్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూడు బ్యాంకులుగా మారాయి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఇక లేనట్లే.
2019 ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్ 1న ముగిసినా.. ఈ ఏడాది నెలాఖరు వరకు ఈ బ్యాంకుల చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు అయ్యాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులు తమ ఖాతాదారులకు జారీ చేసిన చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు చెల్లుబాటు కావు. విలీనమైన బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC), ఎంఐసీఆర్ (MICR) కోడ్‌లు, శాఖలు మారిపోనున్నాయి. ఈ విలీనమైన బ్యాంక కస్టమర్లు ఈనెలాఖరులోగా తమ శాఖలను సంప్రదించి మారిన చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్ కోడ్‌లు తెలుసుకోవాలి.
కాగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంకులు, ఇతర బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంకులు తమ ఖాతాదారుల మొబైల్ నెంబర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నాయి. మారనున్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు, ఎంఐసీఆర్ కోడ్‌ల గురించి కస్టమర్ల మెసేజ్ రూపంలో సమాచారం అందజేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే సదరు బ్యాంకులకు వెళ్లి చెబుతారు.
డిపాజిట్ల సంగతేంటి..?
పాత బ్యాంకుల్లో తీసుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్, రికవరింగ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్‌లు, బీమా పాలసీ, ఆదాయం పన్ను ఖాతాలను బ్యాంకులకు వెళ్లి తగిన వివరాలు అందజేసి అప్‌డేట్స్ చేసుకోవాలి. లేకోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాగే సిండికేట్ బ్యాంకు ఖాదారులు తమ వద్దకు వచ్చే జూన్ 30వ తేదీ వరకు పాత చెక్‌బుక్‌ల లావాదేవీలు జరుపుకొనేందుకు వెసులుబాటు కల్పించారు. ఏదీ ఏమైనా విలీనమైన బ్యాంకు కస్టమర్ల ఈనెల 31లోగా ఆయా బ్యాంకులకు వెళ్లి వివరాలు అందజేయాలి. ఆలస్యం చేసినట్లయితే మీమీ లావాదేవీల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.