పిల్లలను స్కూల్స్ నుండి పంపించేశారు.. జల్లెడ పడుతున్న పోలీసులు

గురువారం నాడు చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది.

By Medi Samrat  Published on  8 Feb 2024 7:32 PM IST
పిల్లలను స్కూల్స్ నుండి పంపించేశారు.. జల్లెడ పడుతున్న పోలీసులు

గురువారం నాడు చెన్నైలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు పిల్లలను స్కూల్స్ నుండి ఇళ్లకు పంపించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాఠశాలలకు చేరుకుని జల్లెడ పట్టారు. బాంబు బెదిరింపు అందుకున్న ఆయా పాఠశాలల్లోని విద్యార్థులను వారి తల్లిదండ్రులతో తిరిగి ఇంటికి పంపించారు. పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని, ఈమెయిల్స్ పంపిన నిందితులని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

బాంబు బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాలల్లో డిఎవి గోపాలపురంలోని చెన్నై పబ్లిక్ స్కూల్, ప్యారీస్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్ ఉన్నాయి. కొద్దిరోజుల కిందట బెంగళూరు నగరంలో స్కూల్స్ కు ఇలాంటి మెయిల్స్ రావడంతో పిల్లలను పాఠశాలల నుండి పంపించి వేశారు. అయితే ఆ తర్వాత ఇది కొందరు ఆకతాయిల పని అని తేలింది.

Next Story