ఆన్‌లైన్‌ క్లాసులో టీచర్ అసభ్య ప్రవర్తన.. త‌ర్వాత ఏం జ‌రిగిందే..

Chennai police arrests teacher Rajagopalan, accused of sexual harassment. ఆన్ లైన్ క్లాసులలో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  25 May 2021 6:01 PM IST
ఆన్‌లైన్‌ క్లాసులో టీచర్ అసభ్య ప్రవర్తన.. త‌ర్వాత ఏం జ‌రిగిందే..

ఆన్ లైన్ క్లాసులలో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని శేషాద్రి బాల విద్యా భవన్ అనే కార్పొరేట్ పాఠశాలలో అకౌంటెన్సీ, బిజినెస్ స్ట‌డీస్ బోధించే రాజ‌గోపాలన్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించ్చాడు. ఆన్ లైన్ క్లాసుల సందర్భంగా పర్సనల్ గా అసభ్య కంటెంట్ ను పంపించడం, మెసేజ్ లు చేయడం వంటివి చేస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేవలం టవల్ మాత్రమే చుట్టుకుని, తన ఛాతీని చూపిస్తున్నాడని విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరోవైపు పోలీసులు సైతం పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి సైతం స్పందించారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో స్కూలు యాజమాన్యం తక్షణమే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. అయితే, ఆ టీచర్ దుష్ప్రవర్తన గురించి తమకు ఇంత వరకు తెలియదని యాజమాన్యం చెప్పుకొచ్చింది.

కీచక టీచర్ అంశం బయట పడగానే ఆ విషయం పై ప్రస్తుత విద్యార్థినిలే కాకుండా పూర్వ విద్యార్థినిలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతేడాది ఆన్‌లైన్ క్లాస్‌ల సమయంలోనూ అతను ఇలాగే ప్రవర్తించాడని ఆరోపించారు. పలువురు విద్యార్థినిలు సోషల్ మీడియా వేదికగా అతని అరాచకాలను బట్టబయలు చేశారు. అశ్లీలంగా బోధించిన వీడియోలు, అతను పంపిన మెసేజ్‌ల తాలూకు స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. వీటిని సింగర్ చిన్మయి, డీఎంకే ఎంపీ కనిమొళి సైతం షేర్ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Next Story