ఫ్రెండ్ కు 2000 ట్రాన్స్ఫర్ చేస్తే.. అకౌంట్లో 753 కోట్లు

చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు ఉండడం చూసి షాక్ అయ్యాడు.

By Medi Samrat  Published on  8 Oct 2023 7:45 PM IST
ఫ్రెండ్ కు 2000 ట్రాన్స్ఫర్ చేస్తే.. అకౌంట్లో 753 కోట్లు

చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు ఉండడం చూసి షాక్ అయ్యాడు. మహమ్మద్ ఇద్రీస్ అనే వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతా నుంచి శుక్రవారం 2000 రూపాయలను తన స్నేహితుడికి బదిలీ చేశాడు. ఈ లావాదేవీ తర్వాత అతను తన ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయగా.. తన అకౌంట్లో రూ. 753 కోట్ల మొత్తం కనిపించింది. ఈ అసాధారణ విషయంపై ఇద్రిస్ బ్యాంక్‌కు తెలిపాడు. దీంతో బ్యాంకు అతని ఖాతాను స్తంభింపజేసింది.

ఇటీవల తమిళనాడులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. గతంలో చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ తన అకౌంట్ ఖాతాలో రూ.9,000 కోట్లు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించాడు. తంజావూరుకు చెందిన గణేశన్ అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో రూ. 756 కోట్లు కనిపించడంతో అతడు కూడా షాక్ అయ్యాడు.

Next Story