ఆస్తులను ప్రకటించిన సీఎం.. ఎన్ని కోట్లంటే..?

Check How Much Property Odisha CM Naveen Patnaik Owns. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన ఆస్తులను ప్రకటించారు.

By Medi Samrat
Published on : 10 Jan 2021 6:19 PM IST

Odisha CM Naveen Patnaik

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన ఆస్తులను ప్రకటించారు. గ‌డిచిన ఏడాది మార్చి 31, 2020 వరకూ ఉన్న త‌న‌ స్థిర, చరాస్తులు మొత్తం కలిపి రూ. 64.98 కోట్లుగా నవీన్ పట్నాయక్ వెల్లడించారు. 2019 సంవత్సరం మార్చిలో ప్రకటించిన ఆస్తులతో పోల్చితే రూ.71 లక్షలు పెరిగినట్లు ఈ లెక్కలతో స్పష్టమైంది.

ఇక ఆయ‌న చరాస్తుల విలువ రూ.13,404,503.1 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.63,64,15,261 కోట్లుగా ప్రకటించారు. అలాగే.. గత సంవత్సరం ఆయా బ్యాంకుల్లో సీఎం డిపాజిట్ చేసిన సొమ్ము రూ.60.45 లక్షలు కాగా, ఈ సంవత్సరం రూ.1.31 కోట్లుగా సీఎం వెల్లడించారు.

ఆస్తుల ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నవీన్ పట్నాయక్‌కు 1980 మోడల్‌కు చెందిన ఓ అంబాసిడర్ కారు ఉంది. ఇప్పుడు ఆ కారు విలువ 8,905 రూపాయలుగా సీఎం వెల్ల‌డించారు. అలాగే.. రూ.2,89,587 రూపాయల విలువ చేసే ఆభరణాలు తన కుటుంబం పేరుతో ఉన్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివ‌రాల‌లో పేర్కొన్నారు.


Next Story