క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. మ్యాచ్ రోజు మెట్రో ట్రైన్ టైమింగ్స్‌ పొడిగింపు

changes in last metro train timings on all lines for T-20 cricket match in Delhi. భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్ల‌ మధ్య జూన్ 9వ తేదీ నుంచి టీ20 సిరీస్

By Medi Samrat  Published on  7 Jun 2022 1:49 PM GMT
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. మ్యాచ్ రోజు మెట్రో ట్రైన్ టైమింగ్స్‌ పొడిగింపు

భారత్‌, దక్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్ల‌ మధ్య జూన్ 9వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభ‌మ‌వ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో మ్యాచ్ రోజు ప్రయాణికుల రద్దీని ముందుగానే ఊహించిన ఢిల్లీ మెట్రో అధికారులు.. ప్రేక్షకులు తమ గమ్యస్థానాలకు సజావుగా చేర్చ‌డానికి వీలుగా సమయాన్ని 30-45 నిమిషాల వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు ఢిల్లీ మెట్రో అధికారులు మంగళవారం ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ నేఫ‌థ్యంలోనే ఢిల్లీ మెట్రో 48 అదనపు స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నుంద‌ని DMRC ఒక ప్రకటనలో తెలిపింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం భారత్-దక్షిణాఫ్రికా జ‌ట్ల‌ మధ్య జరగనున్న T-20 క్రికెట్ మ్యాచ్ వీక్షించి, గ‌మ్య‌స్థానానికి చేరుకునేందుకు ప్రేక్షకులకు వీలుగా అందుబాటులో ఉండేలా ఢిల్లీ మెట్రో అన్ని లైన్లలో (ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ మినహామించి) చివరి రైలు సమయాల్లో స్వల్ప మార్పులు చేసింది.

ఈ స్టేడియం ఢిల్లీ గేట్, ఐటిఓ మెట్రో స్టేషన్‌లకు ఆనుకొని కష్మీరే గేట్, రాజా నహర్ సింగ్ స్టేషన్‌లను కలిపే వైలెట్ లైన్‌లో ఉంది. "మ్యాచ్ ముగిసిన తర్వాత సమీపంలోని ఈ మెట్రో స్టేషన్‌లలో ఆకస్మిక రద్దీని ఊహించి.. ఢిల్లీ మెట్రో అన్ని లైన్‌లలో చివరి ట్రైన్‌ సమయాలను 30-45 నిమిషాలు పొడిగించడం ద్వారా అదనపు స‌ర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

మెట్రోను ఉపయోగించడం ద్వారా ప్రేక్షకులు తమ గమ్యస్థానాలకు సాఫీగా చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. మెట్రో కారిడార్‌లలో రెడ్ లైన్ (రిథాలా-షహీద్ స్థల్ కొత్త బస్ అడ్డా), ఎల్లో లైన్ (సమాయ్‌పూర్ బద్లీ-హుడా సిటీ సెంటర్), బ్లూ లైన్ (ద్వారకా సెకండ్-21-నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ/వైశాలి), పింక్ లైన్ (మజ్లిస్ పార్క్-శివ్ విహార్), మెజెంటా లైన్ (జనక్‌పురి (W)-బొటానికల్ గార్డెన్) ఉన్నాయి. సాధార‌ణంగా మెట్రో స్టేషన్‌ల నుండి చివరి రైళ్లు సగటున రాత్రి 11:30 వ‌ర‌కు న‌డుస్తాయి. మ్యాచ్ నేఫ‌థ్యంలో అర్ధరాత్రి వ‌ర‌కు ట్రైన్‌లు అందుబాటులో ఉండ‌నున్నాయి.














Next Story