చంద్రుడిపై భారీగా సోడియం.. మ్యాపింగ్‌ చేసిన చంద్రయాన్‌-2

Chandrayaan-2 detected heavy sodium on the moon. చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు పంపిన చంద్రయాన్‌-2.. కీలక విషయాన్ని భూమిపైకి చేరవేసింది.

By అంజి  Published on  8 Oct 2022 5:47 AM GMT
చంద్రుడిపై భారీగా సోడియం.. మ్యాపింగ్‌ చేసిన చంద్రయాన్‌-2

చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు పంపిన చంద్రయాన్‌-2.. కీలక విషయాన్ని భూమిపైకి చేరవేసింది. చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు ఉన్నట్లు చంద్రయాన్-2 గుర్తించింది. చంద్రయాన్‌-2 లార్జ్‌ ఏరియా సాఫ్ట్‌ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌ ద్వారా ఈ సోడియం నిల్వలను గుర్తించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. గతంలో చంద్రయాన్-1లోని ఫ్లూరోసెన్స్ స్పెక్టోమీటర్ (సీ1ఎక్స్‌ఎస్) తొలిసారిగా చంద్రుడిపై సోడియం ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా చంద్రుడి చక్కర్లు కొడుతున్న చంద్రయాన్‌-2.. ఈ సోడియం మ్యాపింగ్‌ చేసినట్లు ఇస్రో తెలిపింది.

హైసెన్సిటివిటీ, సామర్ధ్యం కలిగిన క్లాస్‌ (చంద్రయాన్‌-2 లార్జ్‌ ఏరియా సాఫ్ట్‌ ఎక్స్‌రే స్పెక్టోమీటర్‌)ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో తయారుచేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇది సోడియం లైన్స్‌ను వెంటనే గుర్తిస్తుందని అంతరిక్ష పరిశోధకులు చెప్పారు. లూనార్ గ్రెయిన్స్‌తో కలిసి ఉన్న సోడియంను ఈ క్లాస్ గుర్తించింది. చంద్రుడిపై ఉన్న వెదర్‌లో ఇలా సోడియం లభించడం ఇంట్రెస్టింగ్‌ విషయమనే చెప్పొచ్చని.. 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్'లో ప్రచురితమైన ఆర్టికల్‌లో ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలం నుంచి వేల కిలోమీటర్ల వరకు సోడియం జాడలు కనిపించినట్లు ఇస్రో తెలిపింది.

Next Story