ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపాయ్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత చంపాయ్ ముఖ్యమంత్రి అయ్యారు

By Medi Samrat  Published on  2 Feb 2024 3:08 PM IST
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపాయ్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత చంపాయ్ ముఖ్యమంత్రి అయ్యారు. చంపాయ్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంపాయ్‌ హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితుడని చెబుతున్నారు. చంపాయ్.. హేమంత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

చంపాయ్‌ సోరెన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అలంగీర్ ఆలం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలంగీర్ ఆలం పాకూర్ స్థానం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 70 ఏళ్ల ఆలంగీర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్తా కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. సత్యానంద్ ఛత్రా స్థానం నుండి RJD ఎమ్మెల్యేగా గెలిచారు. జార్ఖండ్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 53 ఏళ్ల సత్యానంద్ 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 2019లో తన ఆస్తులు ₹77.58 లక్షలుగా ప్రకటించాడు.

చంపాయ్ సోరెన్ జార్ఖండ్ శాసనసభ సభ్యుడు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా ప‌నిచేశారు. అతను హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను నిర్వహించాడు.

Next Story