'దుబాయ్ షేక్‌కి సెక్స్ భాగస్వామి కావాలి'.. చైతన్యానంద వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు

ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై అరెస్టయిన చైతన్యానంద సరస్వతి మొబైల్ చాట్ నుండి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

By -  Medi Samrat
Published on : 1 Oct 2025 10:25 AM IST

దుబాయ్ షేక్‌కి సెక్స్ భాగస్వామి కావాలి.. చైతన్యానంద వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు

ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యార్థినులను వేధించిన ఆరోపణలపై అరెస్టయిన చైతన్యానంద సరస్వతి మొబైల్ చాట్ నుండి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎన్‌డిటివి నివేదిక ప్రకారం.. చైతన్యానంద వాట్సాప్ చాట్‌లో డర్టీ మెసేజ్‌లు పంపాడు.

చైతన్యానంద మొబైల్ నుండి ఒక విద్యార్థికి పంపిన మెసేజ్‌..

చైతన్యానంద సరస్వతి - దుబాయ్‌కి చెందిన షేక్‌కి సెక్స్ భాగస్వామి కావాలి. మీకు మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారా?

బాధితురాలు: ఎవరూ లేరు.

చైతన్యానంద సరస్వతి - అది ఎలా సాధ్యం.. తెలియ‌క‌పోవ‌డ‌మేంటి.?

బాధితురాలు- నాకు తెలియదు.

చైతన్యానంద సరస్వతి - ఎవరైనా క్లాస్‌మేట్ లేదా జూనియర్?

అతను యువ విద్యార్థినులను ఉద్దేశించి 'బేబీ', 'ఐ లవ్ యు' మరియు 'ఐ ఆడోర్ యు' వంటి సందేశాలతో వేధించాడని, వారి జుట్టు, దుస్తులను పొగడుతూ వారి రూపాన్ని గురించి వ్యాఖ్యానించాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

చైతన్యానంద సరస్వతి మొబైల్ ఫోన్‌లో అతడు చాలా మంది ఎయిర్ హోస్టెస్‌లతో ఉన్న ఫోటోలు కనుగొనబడ్డాయి. చాలా మంది అమ్మాయిల వాట్సాప్ డీపీ స్క్రీన్ షాట్లు కూడా దొరికాయి. మొబైల్ ఫోన్‌లో వచ్చిన చాటింగ్‌లలో చైతన్యానంద అమ్మాయిలను ఎరగా వేసి ప‌లువురిని మోసగించే ప్రయత్నం చేసిన‌ట్లు తేలింది. అతని ఇద్దరు మహిళా సహచరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చైతన్యానంద విచారణకు సహకరించడం లేదని సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. విచారణలో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా అస్పష్టమైన సమాధానాలు చెబుతున్నాడు. తన చర్యల ప‌ట్ల అత‌నికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నాడు. గత శనివారం అర్థరాత్రి పోలీసులు ఆగ్రాలోని ఓ హోటల్‌లో తలదాచుకున్న చైతన్యానంద సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story