రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. నేడే ఫసల్‌ బీమా నిధుల జమ

నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్‌ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.

By అంజి
Published on : 11 Aug 2025 6:35 AM IST

Central Govt, crop insurance, farmers, PM Fasal Bima Yojana

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. నేడే ఫసల్‌ బీమా నిధుల జమ

నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్‌ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి. రాజస్థాన్‌ జుంజునులో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను కేంద్ర కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తారు.

కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, రాజస్థాన్ వ్యవసాయ మంత్రి డాక్టర్ కిరోడి లాల్ మీనా, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుండి సీనియర్ అధికారులు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఆగస్టు 11, సోమవారం మధ్యాహ్నం ఝున్‌ఝును ఎయిర్‌స్ట్రిప్‌లో జరుగుతుంది. ఝున్‌ఝును, సికార్, జైపూర్, కోట్‌పుట్లి-బెహ్రోర్ మరియు ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొంటారు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది రైతులు వర్చువల్‌గా చేరుతారు.

అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రైతులకు రూ.1156 కోట్లు, రాజస్థాన్‌కు రూ.1121 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.150 కోట్లు, ఇతర రాష్ట్రాల రైతులకు రూ.773 కోట్లు అందనున్నాయి. రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా రూ.3,200 కోట్లు బదిలీ చేయబడతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం 2016లో ప్రారంభమైంది. ఈ పథకం కింద నమోదైన రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.

Next Story