టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే!

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది

By -  Knakam Karthik
Published on : 6 March 2026 7:33 PM IST

National News, Delhi, TRP, Information And Broadcasting, Israel Iran War, BARC, TVRatings, MediaGuidelines

టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్‌లు రద్దు..కారణమిదే!

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను, ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇలాంటి సంచలన వార్తలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యూస్ ఛానళ్ల టీఆర్పీ (TRP) రేటింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని బార్క్ (BARC) సంస్థను ఆదేశించింది. ఈ నిషేధం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

Next Story