14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుండి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుండి 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయంగా రూ.5,858.60 కోట్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  1 Oct 2024 8:16 PM IST
14 రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుండి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుండి 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు సాయంగా రూ.5,858.60 కోట్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. ఇందులో మహారాష్ట్రకు రూ.1,492 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.468 కోట్లు, తెలంగాణకు రూ.416.80 కోట్లు చొప్పున విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

వ‌ర‌ద సాయం అందుకోనున్న రాష్ట్రాల‌లో హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, మిజోరంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు ఉన్నాయి. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఈ రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి.

Next Story