రాష్ట్రాల‌కు కేంద్రం శుభ‌వార్త‌.. గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు నిధులు విడుద‌ల.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతంటే..?

Centre releases Rs 15709 crore grant-in-aid to rural local bodies.దేశంలోని రాష్ట్రాల‌కు కేంద్రం తీపి క‌బురు అందించింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sep 2022 9:40 AM GMT
రాష్ట్రాల‌కు కేంద్రం శుభ‌వార్త‌.. గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు నిధులు విడుద‌ల.. ఏపీ, తెలంగాణ‌కు ఎంతంటే..?

దేశంలోని రాష్ట్రాల‌కు కేంద్రం తీపి క‌బురు అందించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు నిధులు విడుద‌ల చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల‌కు క‌లిపి 15 వేల 705 కోట్లను విడుద‌ల చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల‌కు కలిపి 1,221కోట్లు విడుద‌ల అయ్యాయి. ఇందులో ఏపీకి 948.35 కోట్లు విడుద‌ల కాగా.. తెలంగాణ‌కు కేవ‌లం రూ.273 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రూ.3వేల 733 కోట్ల‌ను ఇచ్చింది. ఈ నిధుల‌ను పంచాయ‌తీల అభివృద్ధికి ఖ‌ర్చు చేయ‌నున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేర‌కు.. గ్రామాల్లో తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను ఖ‌ర్చుచేయ‌నున్నారు.

ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రూ.948.35 కోట్లు, బీహార్‌కు రూ.1,921 కోట్లు, ఛ‌త్తీస్‌గ‌డ్‌కు రూ.557 కోట్లు, గుజ‌రాత్‌కు రూ.1,181 కోట్లు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు రూ.224.30 కోట్లు, జార్ఖండ్‌కు రూ.249.80 కోట్లు, క‌ర్ణాట‌క‌కు రూ.1,046.78 కోట్లు, కేర‌ళ‌కు రూ.623 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.1,472 కోట్లు, మ‌హారాష్ట్ర‌కు రూ.1,092.92 కోట్లు, మేఘాల‌య‌కు రూ.40.50కోట్లు, నాగాలాండ్‌కు రూ.18.40కోట్లు, ఒడిశాకు రూ.864 కోట్లు, త‌మిళ‌నాడుకు రూ.1,380.50కోట్లు, తెలంగాణ‌కు రూ.273కోట్లు, త్రిపుర కు రూ.73.50కోట్లు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు రూ.3,733 కోట్ల‌ను విడుద‌ల చేశారు.

Next Story