ఆ గ్యాస్ కనెక్షన్ ఉన్న‌వారికి ఊహించని షాకిచ్చిన ప్ర‌భుత్వం

గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ త‌గిలింది.

By -  Medi Samrat
Published on : 15 March 2026 7:30 PM IST

ఆ గ్యాస్ కనెక్షన్ ఉన్న‌వారికి ఊహించని షాకిచ్చిన ప్ర‌భుత్వం

గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ త‌గిలింది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నవారకి డొమెస్టిక్ ఎల్‍పీజీ రద్దు చేసింది. పీఎన్జీ కలిగి ఉండి అదే సమయంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ (LPG) కనెక్షన్ ఉన్నవారు ఇకపై ఎల్‌పీజీ కనెక్షన్‌ను ఉంచుకోవడానికి వీల్లేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పైప్డ్ గ్యాస్ ఉన్న వారు వెంటనే తమ ఎల్‍పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని ఆదేశించింది. పీఎన్డీ కనెక్షన్ ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొత్తగా ఎల్‍పీజీ కనెక్షన్లు ఇవ్వడం కానీ సరఫరా చేయడం కానీ నిషేధించింది.

Next Story