ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.

By Medi Samrat
Published on : 27 April 2025 1:14 PM IST

ఎన్‌ఐఏ చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును హోం మంత్రిత్వ శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఘటనకు సంబంధించిన ప్రతి కోణాన్ని ఎన్‌ఐఏ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఒక్కొక్కటిగా లింక్‌లు కనెక్ట్ చేసి ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు.

ఏప్రిల్ 22న జరిగిన దాడిని చూసిన ప్రత్యక్ష సాక్షులను ఐజీ, డీఐజీ, ఎస్పీ నేతృత్వంలోని ఏఎన్‌ఐ బృందాలు విచారిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన నిమిషాల వారీగా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 22న‌ మధ్యాహ్నం పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానంలో ఈ సంఘటన జరిగింది.

ఎన్ఐఏ ప్రకటనలో.. 'ఉగ్రవాదుల గురించిన ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్, ఇతర నిపుణుల సహాయంతో, ఉగ్రవాదుల కుట్రను వెలికితీసేందుకు ఆధారాల కోసం బృందాలు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వెల్ల‌డించింది.

మ‌రోవైపు పహల్గామ్‌లో దాడి తర్వాత భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. పహల్గామ్ దాడిపై పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి గురి చేసింది. దేశవ్యాప్తంగా విస్తృత నిరసనలు జరుగుతున్నాయి.

మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ ఘటనను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని ఉగ్రవాదులు కోరుకుంటున్నారని, అందుకే ఇంత పెద్ద కుట్ర చేశారని ఆయన అన్నారు. దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల ఐక్యత, ఉగ్రవాదంపై ఈ పోరులో మనకున్న అతిపెద్ద బలం అని పేర్కొన్నారు.

Next Story