కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది. ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయలు ఒన్ టైమ్ గ్రాంట్‌గా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ డెవెలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2022-23 నుంచి 2025-26 వరకూ పదిహేనో ఆర్ధిక కమిషన్ ప్రకారం ఈ కొత్త పథకం అమలు కానుంది. మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002ను సవరిస్తూ మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2022కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.