కొత్త టెన్షన్.. రాష్ట్రాలు ఇక టెస్టులు చేయాల్సిందే.!

మంకీ పాక్స్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

By Medi Samrat  Published on  9 Sept 2024 6:18 PM IST
కొత్త టెన్షన్.. రాష్ట్రాలు ఇక టెస్టులు చేయాల్సిందే.!

మంకీ పాక్స్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. రోగుల కోసం ఆసుపత్రులలో ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కేంద్రం సోమవారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు తలెత్తకుండా చూడాలని కోరారు. భారతదేశంలో కొత్త mpox కేసు ఏదీ నివేదించలేదని, అనుమానిత కేసులకు సంబంధించి కూడా తీసుకున్న శాంపుల్స్ కూడా ఏవీ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వలేదన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని సూచించారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని అపూర్వ చంద్ర తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించాలని, ముఖ్యంగా ఆరోగ్య సౌకర్యాల స్థాయిలో, ఆసుపత్రులలో ఐసోలేషన్ సౌకర్యాలను గుర్తించాలన్నారు. అనుమానిత, సంభావ్య, ధృవీకరించబడిన కేసులు, కాంటాక్ట్ ట్రేసింగ్‌లపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద నిఘా పెట్టాలని కోరారు.

Next Story