దేశంలో మంకీపాక్స్‌ విజృంభణ.. కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్‌

Central Govt holds meeting of experts to discuss monkeypox management begins. భారత్‌లో మంకీపాక్స్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కేరళలో ఓ వ్యక్తి మంకీపాక్స్‌

By అంజి  Published on  4 Aug 2022 9:19 AM GMT
దేశంలో మంకీపాక్స్‌ విజృంభణ.. కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్‌

భారత్‌లో మంకీపాక్స్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదయ్యాయి. కేరళలో ఓ వ్యక్తి మంకీపాక్స్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్టైంది. మంకీపాక్స్‌ మేనేజ్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ను సవరించేందుకు ఇవాళ ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ డైరెక్టర్‌ ఎల్‌ స్వస్తి చరణ అధ్యక్షతన ఆరోగ్య నిపుణులతో సమావేశం జరుగుతోంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైసెన్స్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు సైతం భేటీకి హాజరయ్యారు.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలో ఎమర్జెన్సీ మెడికల్‌ రిలీఫ్‌ అనేది ఓ విభాగం. ఇది జాతీయ, అంతర్జాతీయంగా ప్రజారోగ్య విషయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గైడ్‌లైన్స్‌ను సవరించేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం ఢిల్లీలో నైజీరియాకు చెందిన 31 సంవత్సరాల మహిళకు మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ మహిళ మంగళవారం లోక్‌ నాయక్‌ ఆసుపత్రిలో చేరగా.. బుధవారం మంకీపాక్స్‌ పాజిటివ్‌గా తేలింది.

అయితే ఆ మహిళ ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని అధికారులు తెలిపారు. గతంలో పాజిటివ్‌గా తేలిన ముగ్గురు నైజీరియన్‌ రోగులకు ఒకరితో ఒకరికి పరిచయం లేదని, వీరంతా వేర్వేరు చోట్ల నివసిస్తున్నారని ఆస్పత్రి అధికారులు ధ్రుకవీరించారు. ఇప్పటి వరకు కేరళలో అత్యధికంగా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. మంకీపాక్స్‌ వ్యాప్తి నేపథ్యంలో గతంలోనే కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

Next Story