గుడ్‌న్యూస్‌.. వారికి పీఎం కిసాన్‌ డబుల్‌..!

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 6:01 AM
central govt, good news, pm kisan,  farmers,

గుడ్‌న్యూస్‌.. వారికి పీఎం కిసాన్‌ డబుల్‌..! 

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌-మే మధ్యలోనే లోక్‌భ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో.. మహిళా రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుందని సమాచారం. 'ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి' పథకం కింద రైతులకు కేంద్రం పంట సాయం అందిస్తోంది. దీని కింద రైతులకు ఏటా రూ.6వేలు ఇస్తోంది. విడతల వారీగా ఈ డబ్బులను నేరుగా రైతుల అకౌంట్లలో వేస్తోంది. అయితే.. తాజాగా మహిళా రైతులకు ఈ పీఎం కిసాన్‌ డబ్బులను డబుల్‌ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికార వార్గాల నుంచి ఈ విషయం తెలుస్తోంది. తద్వారా మహిలా రైతులకు ప్రతి ఏటా రూ.12వేలు పంట సాయం అందించనున్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ. ఈ క్రమంలోనే మహిళా రైతులకు పీఎం కిసాన్‌ నిధులను డబుల్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అప్పుడే మహిళా రైతులకు పంటసాయం పెంపుపై ప్రకటన ఉంటుందని సమాచాం. మహిళా రైతులకు పంటసాయం పెంపు వల్ల ప్రభుత్వంపై అదనంగా మరో రూ.12వేల కోట్ల భారం పడుతుందని అంచనా.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద పంట సాయం అందిస్తోంది. అర్హులైన రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తోంది. ఏడాది మూడు విడుతలుగా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లలో పంటసాయం జమ చేస్తోంది. ఇటీవలే 15వ విడద డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు రైతులు 16వ విడత పీఎం కిసాన్‌ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి చివర్లో కానీ.. మార్చి నెలలో కానీ ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం 15 విడతల్లో 11 కోట్లకు పైగా మంది రైతుల ఖాతాల్లో రూ.2.81 లక్షల కోట్లు విడుదల చేసింది. మరోవైపు మహిళా రైతులకు పంట సాయి రెట్టింపుతో పాటు.. సాధారణ రైతులకు పంట సాయాన్ని రూ.6వేల నుంచి రూ.8వేలకు పెంచనున్నట్లు సమాచారం. ఈ అంశంపై బడ్జెట్‌ సమావేశాల్లో క్లారిటీ రానుంది.


Next Story