వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు

మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, నటులు వైజయంతిమాల బాలి, కొణిదెల చిరంజీవి హా 132 మంది ప్రముఖులకు గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

By అంజి  Published on  26 Jan 2024 12:42 AM GMT
Central government ,Padma awards, Venkaiah Naidu, Chiranjeevi, National news

వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, నటులు వైజయంతిమాల బాలి, కొణిదెల చిరంజీవి, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు దివంగత బిందేశ్వర్ పాఠక్, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి దివంగత ఎం ఫాతిమా బీవీ, బాంబే సమాచార్ యజమాని హార్ముస్జీ ఎన్ కామా సహా 132 మంది ప్రముఖులకు గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

నటుడు మిథున్ చక్రవర్తి, తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు, బిజెపి సీనియర్ రామ్ నాయక్, నటుడు దివంగత విజయకాంత్, గాయని ఉషా ఉతుప్, కిరణ్ నాడార్‌లకు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయమైన పౌర పురస్కారాలు లభించాయని అధికారిక ప్రకటన తెలిపింది. ఇందులో ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది.

2024 పద్మ అవార్డుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు.

తెలంగాణ

1. కూరెళ్ల విట్టలాచార్య- సాహిత్యం & విద్య

2. ఏ వేలు ఆనంద చారి- ఆర్ట్

3. దాసరి కొండప్ప- బుర్ర వీణ వాద్యకారుడు.

4. గడ్డం సమ్మయ్య- జనగాం నుండి యక్షగాన కళాకారుడు

5. కేతావత్ సోమ్‌లాల్- సాహిత్యం & విద్య

ఆంధ్రప్రదేశ్:

1. కొణిదెల చిరంజీవి- నటుడు

2. ఎం వెంకయ్య నాయుడు- రాజకీయ నాయకుడు

3. ఉమా మహేశ్వరి డి- మొదటి మహిళా హరికథ కళాకారిణి

రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే మంగళవారం ప్రకటించింది.

పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన వారు వీరే

వైజయంతిమాల బాల -సినీ నటి- తమిళనాడు

కొణిదెల చిరంజీవి – సినీ నటుడు – ఆంధ్రప్రదేశ్

ఎం వెంకయ్య నాయుడు – రాజకీయాలు – ఆంధ్రప్రదేశ్

బిందేశ్వర్ పాఠక్ (ప్రజా సేవ) బీహార్

పద్మ సుబ్రమణ్యం -కళలు – తమిళనాడు

వీరికే పద్మ భూషణ్ పురస్కారం

ఎం ఫాతిమా బీబీ (ప్రజా సంబంధాలు)- కేరళ

హోర్ మున్షీజీ ఎన్ చామా (సాహిత్యం-విద్య)- మహారాష్ట్ర

మిథున్ చక్రవర్తి (కళలు) – పశ్చిమ బెంగాల్

సీతారాం జిందాల్ (వాణిజ్యం- పరిశ్రమ) – కర్ణాటక

యంగ్ లియూ (వాణిజ్యం, పరిశ్రమ) – తైవాన్

అశ్వినీ బాలాచంద్ మెహతా (వైద్యం) – మహారాష్ట్ర

సత్యబ్రత ముఖర్జీ ( ప్రజా సంబంధాలు) – పశ్చిమ బెంగాల్

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖులు వీరే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన డీ ఉమామహేశ్వరి

తెలంగాణ నుంచి గడ్డం సమ్మయ్య

తెలంగాణ నుంచి దాసరి కొండప్ప

రాజస్థాన్ నుంచి జానకీలాల్‌ –

ఒడిశాకు చెందిన గోపీనాథ్‌ స్వైన్‌

త్రిపుర నుంచి స్మృతి రేఖ ఛక్మా

మధ్యప్రదేశ్ వాసి ఓంప్రకాశ్‌ శర్మ –

కేరళ నుంచి నారాయణన్‌ ఈపీ

ఒడిశా వాసి భాగబత్‌ పదాన్‌

ప‌శ్చిమ బెంగాల్ నివాసి సనాతన్‌ రుద్ర పాల్‌

త‌మిళ‌నాడు నుంచి భద్రప్పన్

సిక్కిం నుంచి జోర్డాన్ లెప్చ

మ‌ణిపూర్ వాసి మచిహన్‌ సాసా

బీహార్ నుంచి శాంతిదేవీ పాశ్వాన్‌, శివన్ పాశ్వాన్‌

ప‌శ్చిమ బెంగాల్ వాసి రతన్‌ కహార్

బీహార్ వాసి అశోక్‌ కుమార్‌ బిశ్వాస్

కేర‌ళ నివాసి బాలకృష్ణన్‌ సాధనమ్ పుథ్యా వితిల్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వాసి బాబూ రామ్‌యాదవ్

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన నేపాల్‌ చంద్ర సూత్రడార్

క‌ర్ణాట‌క నివాసి సోమన్న

అసోం వాసి పార్వ‌తి బారువా

ఛ‌త్తీస్ ఘ‌డ్‌కు చెందిన జగేశ్వర్‌ యాదవ్

జార్ఖండ్ వాసి ఛామి ముర్ము

హ‌ర్యానా నివాసి గుర్విందర్‌ సింగ్

ప‌శ్చిమ బెంగాల్ వాసి దుఖ్ మాజీ

మిజోరాం నివాసి సంగ్థ‌న్ కిమ

ఛ‌త్తీస్‌గ‌ఢ్ వైద్యుడు హేమచంద్‌ మాంజీ

గుజ‌రాత్ నుంచి యజ్డీ మాణెక్‌ షా ఇటాలియా

క‌ర్ణాట‌క వాసి ప్రేమ ధన్‌రాజ్

మ‌హారాష్ట్ర‌కు చెందిన ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి యనుంగ్ జ‌మొహ్‌ లెగో

అసోం నుంచి సర్వేశ్వర్‌ బాసుమత్రి

కేర‌ళ‌కు చెందిన సత్యనారాయణ బెలేరి

అండ‌మాన్ నికోబార్ నుంచి కే చెల్లామ్మాళ్

"'పద్మవిభూషణ్' అసాధారణమైన, విశిష్ట సేవలకు; 'పద్మభూషణ్' ఉన్నత విశిష్ట సేవలకు, 'పద్మశ్రీ' ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకుగానూ ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు" అని ప్రకటన పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 30 మంది మహిళలు, విదేశీయులు/NRI/PIO/OCI కేటగిరీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు, మరణానంతరం తొమ్మిది మంది పురస్కార గ్రహీతలతో సహా 132 పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు ఆమోదించారని పేర్కొంది.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు తెలిపారు. "వివిధ రంగాలలో విశిష్ట సేవలందించినందుకు పద్మ అవార్డులకు ఎంపికైన మన సమాజంలోని మార్పుల రూపకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు" అని అమిత్‌ షా అన్నారు.

Next Story