నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం

Central drugs panel approves Bharat Biotech's nasal vaccine against Covid-19. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి పెద్ద ఊతంగా, భారత్ బయోటెక్ కు చెందిన

By Medi Samrat  Published on  6 Sept 2022 6:05 PM IST
నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం

కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి పెద్ద ఊతంగా, భారత్ బయోటెక్ కు చెందిన నాసల్ వ్యాక్సిన్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని.. 18 ఏళ్లు పైబడిన వారిలో కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రాథమిక రోగనిరోధకత కోసం CDSCO ద్వారా వ్యాక్సిన్ ఆమోదించబడింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఇప్పుడీ నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ సంస్థ ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పటిదాకా 4 వేల మంది వాలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వగా, ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి ఈ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, భారత్ బయోటెక్ కరోనా నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయని తెలిపారు.

"This step will further strengthen our collective fight against the pandemic. India has harnessed its science, R&D, and human resources in the fight against Covid-19 under PM Narendra Modi's leadership. With the science-driven approach & Sabka Prayas, we will defeat Covid-19." అంటూ మరో ట్వీట్ చేశారు.


Next Story