ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

By Medi Samrat
Published on : 21 Aug 2025 2:55 PM IST

ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!

జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కొంతకాలంగా దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని నకిలీ వార్తగా కొట్టిపారేసింది. టూవీలర్ల నుంచి కూడా టోల్ రుసుము వసూలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ద్విచక్ర వాహనాల నుంచి ఎలాంటి యూజర్ ఫీజు వసూలు చేయడం లేదు.

ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ రహదారుల ఫీజు (నిర్ణయం, సేకరణ) నిబంధనలు-2008 ప్రకారమే టోల్ వసూళ్లు జరుగుతున్నాయని, ఈ నిబంధనలను మార్చే ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వర్తిస్తుంది. కారు, జీపు, వ్యాన్, తేలికపాటి వాణిజ్య వాహనం, బస్సు, ట్రక్కు, భారీ నిర్మాణ యంత్రాలు, మల్టీ యాక్సిల్ వాహనాల వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.

Next Story